వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు

విశాఖ‌: విశాఖ జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌వ‌ర్గంలో 245వ  రోజు ప్ర‌జా సంక‌ల్పయాత్రలో రాష్ట్ర మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై జ‌న‌నేత‌తో చ‌ర్చించారు. అలాగే పంచ‌దార్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో మాజీ ఎమ్మేల్యే జి.దేముడు కుమార్తె మాధ‌వి వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరారు. ఆశావ‌ర్క‌ర్లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఇబ్బందులు తెలిపారు. చంద్ర‌బాబు అబ‌ద్ధ‌పు హ‌మీల‌తో మోసం చేశార‌న్నారు. విశాఖ జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం కొత్త‌ప‌ల్లి క్రాస్ నుంచి ప్రారంభ‌మ‌యిన యాత్ర నారాయ‌ణ‌పురం, మామిడిగూడ,గోకివాడ‌, పంచ‌దార్ల‌, అప్ప‌రాయుడిపాలెం మీద‌గా ధార బోగాపురం వ‌రుకూ కొన‌సాగింది.  జ‌గ‌న్ శ‌నివారం మొత్తంలో 9 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశారు. 

Back to Top