ఆర్టీసీ కార్మికుల హ‌ర్షం


చిత్తూరు:  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇవ్వ‌డం ప‌ట్ల ఆర్టీసీ కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 53వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ ఈ హామీ ఇచ్చారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో కట్టి ఏడున్నరేళ్లు అయినా బస్సులు ఇవ్వలేదని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి రావ‌డంతో ఈ విష‌యంపై ఆయ‌న స్పందించారు. పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామ‌ని, ఆర్టీసీని బ్రహ్మాండంగా నడిపిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన‌డంతో ఇవాళ ఆర్టీసీ కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేసి సంబ‌రాలు చేసుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వారు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.
Back to Top