వైయస్‌ జగన్‌తో ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టర్‌ భేటీ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌జగన్‌మోహన్‌ రెడ్డితో  ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టర్‌) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టర్‌ వైయస్‌ జగన్‌ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. త్వరలో జరుగనున్న శాసనమండలి ఎన్నికల్లో  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా వైయస్‌ జగన్‌ను కోరినట్లు ఆర్‌ఎస్‌ఆర్‌ తెలిపారు. మా విజ్ఞప్తికి వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారని ఆయన తెలపారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా వైయస్‌ఆర్‌సీపీ తనకు మద్దతు ఇచ్చిందని ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టర్‌ గుర్తు చేశారు.

Back to Top