బాధిత కుటుంబాలకు రూ. 50 వేల సాయం

తూర్పు గోదావరి :  లాంచీ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘోరప్రమాదం చోటు చేసుకుందని, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబాలకు వైయస్‌ఆర్‌ సీపీ తరుపున రూ. 50 వేల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనంత ఉదయభాస్కర్‌ తదితరులు సంఘటనా స్థలంలో బాధితులను పరామర్శించారు. 
Back to Top