ఆల‌య అభివృద్ధికి రూ.50 వేలు విరాళం

ప్ర‌కాశం: గిద్దలూరు పట్టణం లోని సీతారాముల‌ దేవస్థానం ఆలయ అభివృద్ధి కొరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐవీ రెడ్డి రూ. 50 వేలు విరాళం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌గా, ఆల‌య కమిటీ స‌భ్యులు, అర్చ‌కులు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని దేవున్ని ప్రార్థించిన‌ట్లు ఐవీ రెడ్డి తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Back to Top