రైతులు..కూలీల‌కు రూ.4 వేల పింఛ‌న్

వైయ‌స్ఆర్ జిల్లా:  కరవు ప్రాంత రైతులు, కూలీల ఇబ్బందుల దృష్ట్యా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెలకు రూ:  4 వేల చొప్పున పింఛ‌న్ మంజూరు చేసి ఆదుకుంటామ‌ని రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామ రైతులు,కూలీలతో ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి క‌రువు ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలోకి క‌రువు వ‌స్తుంద‌న్నారు. మూడేళ్లుగా రైతులు క‌రువుతో అల్లాడుతున్నా ఆదుకునే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ప్ర‌తి దాంట్లోనూ తెలుగు దేశం పార్టీ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఇసుక‌, మ‌ట్టి, మ‌ద్యం ఇలా అన్నింట్లో అవినీతికి తెర లేపార‌ని మండిప‌డ్డారు. కూలీల‌ను ఆదుకోకుంటే ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం ప్రమాదంలో మృతి చెందిన వడ్డె పల్లె కు చెందిన పాపులమ్మకు ఎమ్మెల్యే నివాళుల‌ర్పించారు.

Back to Top