డ్వాక్రా మహిళల హర్షం


తూర్పు గోదావరి:  మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుందని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తరచుగా చెప్పేవారు. ఆయన బాటలోనే వైయస్‌ జగన్‌ నడుస్తున్నారు.  సంఘమిత్ర, వీవోఏ, వెలుగు యానిమేటర్లకు వైయస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. యానిమేటర్లు రూ.5 వేలు జీతం ఇవ్వాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేయగా, రూ.10 వేలు జీతం ఇస్తామని మహిళల కరతాళ  ధ్వనుల మధ్య వైయస్‌ జగన్‌ ప్రకటించారు. వైయస్‌ జగన్‌ నిర్ణయం పట్ల డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తనను కలిసిన మహిళలతో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..మహిళలు సంతోషంగా ఉంచడమే తన లక్ష్యమన్నారు. మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే నవరత్నాల్లో భాగంగా పొదుపు మహిళల రుణాలను నాలుగు ధపాలుగా నేరుగా సభ్యుల చేతులకే ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని చెప్పడం, ఇప్పుడు వెలుగు సిబ్బందికి వేతనాలు రూ.10 వేలు పెంచుతామని ప్రకటించడం పట్ల డ్వాక్రా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పాదయాత్రలో పలువురు మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
 
Back to Top