ప్రత్యేకహోదా ఆవశ్యకతపై దిశానిర్దేశం

ఏలూరుః ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు రాష్ట్రవ్యాప్తంగా జననీరాజనం పడుతున్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాక్టటు పెట్టిన చంద్రబాబు మోసాలను వైయస్ జగన్ ఎక్కడిక్కడ ఎండగడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకహోదా బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొని ఉద్యమిస్తున్నారు. ప్రత్యేకహోదా ఆవశ్యకతను విద్యార్థులు, యువతకు యువభేరి సదస్సుల ద్వారా దిశానిర్దేశం చేస్తూ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. ఆంధ్రులను హక్కును సాధించుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.


ఈక్రమంలోనే ఏలూరులో నిర్వహిస్తున్న యువభేరి ప్రాంగణానికి వైయస్ జగన్ చేరుకున్నారు. ఈసందర్భంగా యూత్ జననేతకు గ్రాండ్ వెల్ కమ్ పలికింది. అంతకుముందు రహదారి పొడవునా వైయస్ జగన్ కు పార్టీ నేతలు, ప్రజలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్రత్యేకహోదా పోరాటయోధుడు జైజగన్ అంటూ నినదించారు. 
Back to Top