తెలంగాణలో ప్రతీ ఇంటికి వైఎస్ తో అనుబంధం


రాష్ట్రంలో ప్రతి ఇంటితో వైఎస్‌కు అనుబంధం ఉందని, ప్రతి ఇళ్లు వైఎస్సార్ పథకాలతో లబ్ధి పొందిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీలో ఇద్దరు చంద్రులు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ గాలిలో
మేడలు కడుతున్నారని ఆమె మండిపడ్డారు.
 బంగారు తెలంగాణగా చేస్తానని ఒకరు, సింగపూర్‌లా అభివృద్ధి చేస్తానని మరొకరు ప్రజలతో ఓట్లు
వేయించుకున్నారని కేసీఆర్, చంద్రబాబుపై
రోజా మండిపడ్డారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ
అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా పర్వతగిరి, రాయపర్తి, తొర్రూరు, సంగెం
తదితర మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు.

కోటి ఆశల తెలంగాణ.. ప్రస్తుతం రైతుల ఆత్మహత్యతో
విలవిల్లాడిపోతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 17 నెలల పాలనలో 1,400 మంది
రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. పత్తికి కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. వరుసగా
తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ
అన్నారని మండిపడ్డారు. కానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విత్తనాల ధర తగ్గించి, వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ అందజేసి, రైతుల రుణాలను మాఫీ చేసి రైతు బాంధవుడయ్యూరని చెప్పారు.





అధికారంలోకి వచ్చిన 17 నెలల
కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో
పంటల్లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
ఇవ్వడం లేదని, రైతులకు రుణాలు మాఫీ చేయడం లేదని
దుయ్యబట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కడంతో అన్ని వర్గాల
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.

Back to Top