నరసింహుని సన్నిధిలో ఎమ్మెల్యే రోజా

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా దర్శించుకున్నారు.  ఆలయానికి చేరుకున్న ఆమె స్వామివారితో ఆలయ ఆవరణలో కొలువుతీరి ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజాను వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ తోట శ్రీనివాసరావు, కౌన్సిలర్ నల్లగొర్ల శ్రీనివాసరావు, వజీర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Back to Top