డీసీహెచ్‌ఎస్ పనితీరు ఇదేనా?


స్కావెంజర్లకు అందని జీతాలు
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రులను డీసీహెచ్‌ఎస్ సరళాదేవి చుట్టపుచూపుగా తనిఖీలు చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆస్పత్రి అభివృద్ధి సలహా మండలి చైర్‌పర్సన్‌గా ఆమె  పుత్తూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిలో 9 నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ స్కావెంజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. వారు పలుమార్లు డీసీహెచ్‌ఎస్‌ను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. పై పెచ్చు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయండంటూ ఆమె స్కావెంజర్లకు సూచనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
Back to Top