పగ తీర్చుకొంటారా: ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్) ముఖ్యమంత్రి
చంద్రబాబు వ్యవహార శైలిపై మహిళా ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ మహిళా విభాగం
అధ్యక్షురాలు రోజా మండిపడ్డారు. పగ తీర్చుకొనే వైఖరి తో వ్యవహరిస్తున్నారని ఆమె
అన్నారు. ఈ మేరకు ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అత్తెసరు జీతాలతో
జీవితాల్ని నెట్టుకొస్తూ లక్షలాది నిరుపేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్న
అంగన్ వాడీ మహిళలు తమ జీతాలు పెంచాలని కోరుతూ రోడ్డెక్కిన పాపానికి ఈ రోజున వారు
చంద్రబాబు కత్తి వేటుకి బలైపోయే పరిస్థితి ఏర్పడటం దారుణం అని ఆమె అభిప్రాయ
పడ్డారు. ఈ నెల 18న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు
ప్రయత్నించారన్న అక్కసుతో వేల మంది అంగన్ వాడీ మహిళల్ని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం దారుణమని ఆమె అభిప్రాయపడ్డారు. వీడియో సీడీల సాయంతో
గుర్తించి, వారీని సర్వీసుల్లోంచి తొలగించేందుకు వీలుగా వాటిని జిల్లా కలెక్టర్లకు
అందచేయాలని ఆదేశాలివ్వటం అత్యంత కిరాతకమైన రీతిలో ప్రతీకారం తీరచుకోవటం అత్యంత
శోచనీయం అని ఆమె అన్నారు. ఈ దుర్మార్గపు చర్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున
తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె చెప్పారు.

ఇప్పటికైనా ఈ ఆదేశాల్ని
ఉపసంహరించుకోవాలని రోజా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళల తరపున వైఎస్సార్సీపీ
ఉద్యమించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.  

Back to Top