వివరణ కూడా తీసుకోరా..


హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్
కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి ఏడాది పాటు  సస్పెండ్
చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. సభ
నుంచి తనను సస్పెండ్ చేసినపుడు, కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వరా
అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూసి రాష్ట్ర ప్రజలు తలదించుకునే
పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‑ అసెంబ్లీలో కాల్
మనీ వ్యవహారం గురించి ప్రశ్నిస్తానన్న భయంతోనే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని  వైఎస్ఆర్
సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రూల్స్‑ను పక్కనబెట్టి కక్షపూరితంగా తనను
సస్పెండ్ చేశారని ఆరోపించారు.
 

Back to Top