మంచినీటి పైప్‌లైన్ ప్రారంభించిన రోజా

చిత్తూరు: న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వ‌డ‌మ‌ల‌పేట మండ‌లం అమ్మ‌గుంట గ్రామంలో నూత‌నంగా నిర్మించిన‌ మంచినీటి పైప్‌లైన్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. శనివారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై కుళాయిల ద్వారా నీటి విడుద‌ల‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..వేస‌విలోమంచినీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా కూడా నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు రోజా తెలిపారు. మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు.

Back to Top