సీఎం అంటే కాల్ మనీ

హైదరాబాద్ః సభ్యసమాజం తలదించుకునే విధంగా రాజధానిలో టీడీపీ ఘోరాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. పేద, మధ్యతరగతి మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ టీడీపీ నేతలు వారి పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అండతోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తున్నారన్నారు. మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న పార్టీ వాళ్లని, తన కనుచూపు మేరలో తిరుగుతున్న వాళ్లని ఏం చేస్తాడో చంద్రబాబు అసెంబ్లీలో సమాధానం చెప్పి తీరాలన్నారు. 

మద్యపానంతో ఎన్నో కుటుంబాలు నిర్వీర్యం అయ్యాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది భర్తలను కోల్పోయి క్షోభ పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్న రాజధానిలో  ...ఇన్ని ఘోరాలు, తప్పుడు కార్యక్రమాలు జరుగుతుంటే పేద ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. అధిక వడ్డీలకు  డబ్బులివ్వడంతో పాటు మహిళలకు మత్తమందు ఇచ్చి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం దుర్మార్గమన్నారు. సాక్ష్యాధారాలతో 200పైగా వీడియో క్లిప్పింగ్ లు దొరికినా నిందితులను శిక్షించకపోవడం దుర్మార్గమన్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని రోజా స్పష్టం చేశారు. 

Back to Top