బాబు ప్రత్యేక ప్యాకేజీ ఎలా తెస్తారో చెప్పండి: రోజా

తిరుపతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్యాకేజీల పేరుతో బాబు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో జరిగిన వైసీపీ ధర్నాలో పాల్గొన్న రోజా బాబుపై నిప్పులు చెరిగారు. మందీ   మార్బలంతో ఢిల్లీ వెళ్లి ఉత్త చేతులతో వెనక్కి వచ్చిన చంద్రబాబు...సిగ్గులేకుండా ప్యాకేజీల పేరుతో  ప్రజలను మభ్యపెడుతున్నారని  విమర్శించారు. 
 
ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్యాకేజీ తీసుకొస్తానన్న బాబు అది ఎలా తెస్తారో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అసలు ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురావడం ఇష్టం లేనట్టుందని అన్నారు. 
Back to Top