రోజా పిటిషన్ పై విచారణ ఈనెల 3కు వాయిదా

హైదరాబాద్ః ఈనెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున...సభకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతూ కోర్టులో అప్పీలు చేసినట్లు  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.  రూల్స్ కు విరుద్ధంగా సస్పెండ్ చేసి టీడీపీ తనపై కక్షసాధింపుకు పాల్పడుతుందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని రోజా అన్నారు. కోర్టులో తమ లాయర్ రూల్స్ ప్రొసిజర్ వినిపించారని రోజా పేర్కొన్నారు. పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసినట్లు రోజా చెప్పారు. 

Back to Top