తిరుపతి : వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బుతో సెటిల్ చేయాలని చూస్తున్నారని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా ఆరోపించారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా తయారుచేసిన పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైందని ఆమె అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో యూనివర్శిటీ వీసీ, ప్రిన్సిపాల్ లను తక్షణమే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె సూచించారు.<br/>