సుప్రీం కోర్టులో రోజా పిటిషన్

న్యూఢిల్లీ: నగరి నుంచి తన ఎన్నికకు సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై వైయ‌స్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోజా ఎన్నికను రద్దు చేయాలంటూ రాయుడు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని తిరస్కరించాలంటూ రోజా హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశారు. రాయుడు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు రోజా వేసిన పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. దీంతో రోజా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయుడి పిటిషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Back to Top