సిమెంట్ రోడ్డును ప్రారంభించిన రోజా

వడమాలపేటః మండలంలోని పత్తిపుత్తూరు గ్రామంలో రూ.10 లక్షల ఎంజీఆర్‌జీఎస్, తుడా నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డును ఎమ్మెల్యే ఆర్కేరోజా ప్రారంభించారు. పత్తిపుత్తూరుకు విచ్చేసిన రోజా నూతనంగా నిర్మించిన రోడ్డు వద్ద పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల‌న్న‌దే త‌న ధ్యేయ‌మ‌న్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సురేష్, ఎంపీపీ మురళి, సర్పంచ్ ప్రతిమ, నాయకులు సుబ్రమణ్యం రెడ్డి, వెంకటరెడ్డి, ఎంపీటీసీ రంగనాధం, సుబ్రమణ్యం, ధనంజయులు, మురళి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top