యువతను రోడ్డున పడేశారు

హైదరాబాద్‌:  జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేష్‌ను మంత్రిని చేసిన చంద్రబాబు యువతను రోడ్డున పడేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెడ్డారని ధ్వజమెత్తారు. సొంత జిల్లాకు ఏమీ చేయలేని చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు కలెక్షన్‌ కింగ్‌లుగా మారారని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన మంత్రులై అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.
 
Back to Top