పుట్టిన రోజు అయినా.. పండగ అయినా.. ప్రజల్లోనే..!

వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల
ప్రచారంలో బిజీగా ఉన్న వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా తన పుట్టిన
రోజు వేడుకలు జరుపుకొన్నారు. ఉదయం నుంచీ ఒక వైపు ప్రచారం సాగిస్తుండగానే ఆమె
జన్మదినం విషయం బయట పడింది. రెండు రోజుల ముందే అభిమానుల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో పార్టీ నాయకులు అక్కడకే కేక్ తెప్పించారు.
పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలోనే ఆమె జన్మదిన వేడుకలు
జరుపుకొన్నారు. అభిమాన నేతకు కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలపారు. జన్మదినోత్సవం
చేయించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

గడచిన నాలుగు రోజులుగా రోజా ప్రచారం చురుగ్గా
సాగుతోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లా సూర్య ప్రకాష్
ను వెంటబెట్టుకొని ఆమె పర్యటిస్తున్నారు. ఈ ప్రచారంలో పార్టీ అధ్యక్షులు పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. పర్యటనలో రోజా ప్రచార
శైలి, వాక్చాతుర్యం తో ప్రత్యర్థుల్ని హడల గొడుతున్నారు. రాజన్న మీద ఉండే అభిమానాన్ని
చాటుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె పిలుపు ఇస్తున్నారు. 

Back to Top