రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న‌ది దుర్మార్గం


తిరుప‌తి) క్యాబినెట్ స‌మావేశంలో ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కు క్లీన్ చిట్ ఇవ్వ‌టాన్ని పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు రోజా త‌ప్పు ప‌ట్టారు. ఇది ఒక దుర్మార్గ చ‌ర్య గా ఆమె అభివ‌ర్ణించారు. చింత‌మ‌నేని ని వెనుకేసుకొని రావ‌టానికి మ‌హిళా అధికారిని బ‌లి పెట్ట‌డం ఎంత వ‌ర‌కు భావ్యం అని ఆమె అన్నారు. తిరుప‌తి లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక మ‌హిళా త‌హ‌శీల్దార్ కే రక్ష‌ణ లేదంటే, ఇక సామాన్య మ‌హిళ‌కు ఏమాత్రం ర‌క్ష‌ణ ఉన్న‌ట్లు అని ఆమె ప్ర‌శ్నించారు. వ‌న‌జాక్షి త‌ర‌పున ఉద్యోగుల సంఘాలు పోరాటం చేయాల‌ని ఆమె పిలుపు ఇచ్చారు. దీనికి వైఎస్సార్‌సీపీ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆమె అన్నారు. 
Back to Top