రోజా పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కు  సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది.  రూల్స్ కు విరుద్ధంగా టీడీపీ సర్కార్ ఏడాదిపాటు తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని పేర్కొంటూ.... ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని శుక్రవారం విచారణకు తీసుకున్న జస్టిస్ జగదీశ్ కెహర్ మరో బెంచ్ కు  బదిలీ చేయాలని సూచించారు. దీంతో, మరోసారి ఆ కేసును రోజా తరుపు న్యాయవాది సోమవారం ప్రస్తావించనున్నారు. 

రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై శాసనసభ సమావేశాల్లో .. వైఎస్సార్సీపీ చర్చకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. మహిళల మాన ప్రాణాలతో ఆటలాడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో పాటు రోజా కూడా నినదించారు.  ఐతే, తమ ఆకృత్యాలు ఎక్కడ ప్రజలకు తెలిసిపోతాయోనన్న భయంతో..చంద్రబాబు, మంత్రులు అకారణంగా మహిళల సమస్యను ప్రస్తావించినందుకు రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. 

రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top