ఎంపీ నిధులతో రోడ్డు ప‌నులు ప్రారంభం

బి.కొత్తకోట: రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి ఎంపీ ల్వాడ్స్‌ నుంచి మంజూరు చేసిన నిధులతో గురువారం రోడ్డు పనులను స్థానిక ఎంపీపీ ఖలీల్, గట్టు సర్పంచు ముబీనాలు ప్రారంభించారు. గట్టు పంచాయతీలోని గట్లమీదపల్లెలకు సరైన రోడ్డు సౌకర్యంలేదు. దీనిపై స్థానికుల విన్నపం మేరకు మిధున్‌రెడ్డి బత్తులబావి నుంచి ఓగుచెరువు వరకు రోడ్టు పనులు చేయించేందుకు రూ.2లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రోడ్డు పనులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మియాసాబ్, వార్డుసభ్యులు సికిందర్, నరసింహులు నాయుడు, సలీం, ప్రభాకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top