అసెంబ్లీలో ప్రజాస్వామ్యం పాతర

అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కాల్ మనీ సెక్స్
రాకెట్ మీద ప్రశ్నించిన పాపానికి అధికార పక్షం ఈ చర్య తీసుకొంది. ఒక మహిళా సభ్యురాలి
మీద ఇటువంటి చర్య తీసుకోవటాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారు. 

మొదట నుంచి సెక్సు రాకెట్ మీద చంద్రబాబు ప్రభుత్వాన్ని మహిళా ఎమ్మెల్యేలతో
కలిసి రోజా ప్రశ్నిస్తూ వచ్చారు. అంతే గాకుండా వైఎస్సార్సీపీ మహిళా
విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరాచకాల్ని
ప్రశ్నిస్తున్నందుకు గాను సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె పై ఏడాదిపాటు
సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసన సభ వ్యవహారాల
మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రతిపాదన చేయగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు
ఆమోదించారు

Back to Top