ప్రపంచ మేధావికి హోదా లాభాలు తెలియవా..?

తిరుపతి: ఆంధ్రరాష్ట్రంలో చిన్న పిల్లోడు కూడా ప్రత్యేక హోదా లాభాలు చెప్పగలిగినప్పుడు, ప్రపంచ మేధావి అని చెప్పుకునే చంద్రబాబుకు అవి తెలియవా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... హోదా వల్ల లాభాలు ఏంటో తెలియకుండానే మ్యానిఫెస్టోలో పెట్టావా..? తెలియకుండానే పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలని అడిగావా...? అసెంబ్లీలో రెండు సార్లు తీర్మాణం చేశావా...? అని నిలదీశారు. రాజన్న పరిపాలన వస్తుందని, రాజన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లగలం అన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్న క్రమంలో చంద్రబాబు ఇచ్చిన 600  హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. అధికారం లేకపోయినా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌పై  ప్రజల ఆదరాభిమానాలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నరేంద్రమోడీ, పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసికట్టుగా 600 హామీలు ఇచ్చినా కేవలం వైయస్‌ఆర్‌ సీపీపై 5 లక్షల ఓట్ల మెజార్టీతోనే అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు.

Back to Top