చంద్రబాబు అమ్ముడుపోయారు

హైదరాబాద్ః కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు చనిపోతున్నా సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్టు కూడ లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిందని అన్నారు. ఇంకా ఎంతమంది పిల్లలు చనిపోతే చంద్రబాబు స్పందిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, గంటా శ్రీనివాసరావులు కార్పొరేట్ కాలేజీలకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. నారాయణ కాలేజీలన్నీ నారా చంద్రబాబు బినామీ కాలేజీలు కాబట్టే చర్యలు తీసుకోకుండా వదిలేశారా..?  అని మంత్రి గంటాను ప్రశ్నించారు.

Back to Top