అవినీతి పాలనను కూల్చేద్దాం

టీడీపీకి గుణ‌పాఠం చెబుదాం
విజ‌య‌న‌గ‌రం: ఎన్నిక‌ల హామీల‌ను విస్మ‌రించిన‌ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెబుదామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. శ‌నివారం విజ‌య‌న‌గరం జిల్లాలో పార్టీ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన కృష్ణదాసు, ఉత్త‌రాంధ్ర జిల్లాల క‌న్వీన‌ర్ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జిల్లా అధ్య‌క్షుడు బెల్ల‌న చంద్ర‌శేఖ‌ర్‌, పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ..ఎన్నిక‌ల స‌మ‌యంలో డ్వాక్రారుణాలు మాఫీ చేస్తామ‌ని గ‌ద్దెనెక్కి ఆ త‌రువాత మాట త‌ప్పార‌ని ఫైర్ అయ్యారు. టీడీపీ మూడేళ్ల పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, టీడీపీ నేత‌ల అరాచ‌కాల‌కు మ‌హిళ‌లు బ‌లై పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తన తోడేళ్లను కాపాడుకునేందుకు చంద్రబాబునాయుడు ఆడవాళ్ల మాన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని మండిప‌డ్డారు. దళితమంత్రితో కాళ్లు పట్టించుకున్న చంద్రబాబు మహిళలకు ఏం చేస్తారని ఆమె నిల‌దీశారు. పేరుకే తప్ప మహిళా మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని, మహిళల సంక్షేమాన్ని గాలి కొదిలేస్తే ప్రజలు తాటతీస్తారన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. స‌మ‌ష్టిగా ప‌నిచేసి అవినీతి పాల‌న చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చి వేద్దామ‌ని పిలుపునిచ్చారు.

Back to Top