మీ అత్తగారి సొత్తా..?ఖర్జూరనాయుడి ఆస్తా?

  • రౌడీలా మాట్లాడిన చంద్రబాబు ఓ ముఖ్యమంత్రా..?
  • మీరు మాట్లాడితే ప్రవచనాలు, మేం మాట్లాడితే బూతులా?
  • వైయస్‌ జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యముందా
  • శిల్పా చక్రపాణిని చూసి ఆ 20 మంది సిగ్గుపడాలి
  • వైయస్‌ జగన్‌ మాటలను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు
  • నీ అంతు చూస్తానని ప్రతిపక్షనేతను బాబు బెదిరించారు
  • గతంలో వైయస్‌ఆర్‌ని ఎవరు ఫినిష్‌ అవుతారో చూద్దామని బెదిరించారు
  • తల్లి ఆశయాలకు అఖిలప్రియ తూట్లు పొడుస్తోంది
  • సభకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీకి తడిసిపోయింది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
నంద్యాల: నంద్యాల బహిరంగ సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. బహిరంగ సభలో లక్ష మంది ప్రజల సమక్షంలో శిల్పా చక్రపాణిరెడ్డి నైతిక విలువలతో  వైయస్‌ జగన్‌కు మద్దతుగా రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారన్నారు. నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిల్పా రాజీనామాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. దాన్ని డైవర్ట్‌ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యా రాజకీయాలను చూసి ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై కాల్చేయాలని ఎవరైనా అన్నా తప్పులేదని నాకు అనిపిస్తుందన్న వైయస్‌ జగన్‌ మాటలను....టీడీపీ నేతలు కాల్చేయమన్నారన్నట్లుగా వక్రీకరించుకొని ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడడం దారుణమన్నారు. 

కనీసం వారికి నోటీసులైనా ఇచ్చారా..?
చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా వైయస్‌ జగన్ను నీ అంతు చూస్తా అని మాట్లాడరని, బోండా ఉమా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీలో పాతేస్తానని మాట్లాడితే కనీసం స్పీకర్‌ వారికి నోటీసులు అయినా ఇచ్చారా అని రోజా ప్రశ్నించారు. అంటే వారు మాట్లాడితే అవి చాగంటి ప్రవచనాలు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే బూతులా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత నీచమైన వ్యక్తో పిల్లనిచ్చిన మామ స్వర్గీయ ఎన్టీఆర్‌ చాలా సార్లు చెప్పారన్నారు. అదే విధంగా చంద్రబాబు పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని దగ్గుపాటి చెప్పారని గుర్తు చేశారు. 

ఇన్ని చేసిన చంద్రబాబు ఏమనాలి...
–పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఏమనాలని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. 
–ప్రజల కోసం పోరాడుతున్న కాపు సామాజిక నేత ఎక్కడ ఎదుగుతాడోనని నడిరోడ్డుపై రంగాను హత్య చేయించిన చంద్రబాబును ఏమనాలి. 
–దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి అయిన వైయస్‌ రాజారెడ్డిని హత్య చేసిందెవరు.. హంతకులను చేరదీసి వారికి బాబు ఎలాంటి పదవులు ఇచ్చారో గుర్తు చేసుకోవాలి
–నిజాయితీ గల ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుకలో వేసి కొడితే కనీసం సారీ కూడా చెప్పించకుండా ఆవిడనే తిట్టి సెటిల్‌మెంట్‌ చేసిన చంద్రబాబును ఏమనాలి.
–నిజాయితీ గల ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యంను టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నడిరోడ్డుపై అవమానపర్చి, ఐపీఎస్‌ గన్‌మెన్‌పై దాడి చేస్తే  ఒక సారీతో సెటిల్‌మెంట్‌ చేసిన వ్యక్తిని ఏమనాలి. 
– కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఎంతో మంది అమాయక మహిళల జీవితాలు ఆగమైపోతుంటే వాటికి కారణమైన టీడీపీ నేతలను సిగ్గులేకుండా  అసెంబ్లీలో, మండలిలో కూర్చొబెట్టుకుంటే ప్రశ్నించిన తనను సంవత్సరం పాటు సస్పెండ్‌ చేసిన వ్యక్తులను ఏమనాలి. 
–కర్నూలు జిల్లా పత్తిపాడు వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్‌ నారాయణరెడ్డిని పట్టపగలు చంద్రబాబు, డిప్యూటీ సీఎం హత్య చేశారనేది ప్రజలు మర్చిపోలేదన్నారు. 

ది ఖర్జూరపు నాయుడు ఆస్తా..? లేక నీ అత్తగారి ఆస్తా..?
చంద్రబాబు చాలా సందర్భాల్లో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను హెచ్చరించారని రోజా గుర్తుకు చేశారు. నాతో పెట్టుకున్న వారు బతికిబట్టకట్టలేదని, దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్‌ బిక్షతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు అసెంబ్లీలో మైక్‌ కూడా ఇవ్వకుండా వైశ్రాయ్‌ హోటల్‌ ఎదుట చెప్పులు వేయించి ఎన్టీఆర్‌ చావుకు కారణం అయ్యారన్నారు. 2009 సెప్టెంబర్‌ 1వ తేదీ అసెంబ్లీలో మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని చంద్రబాబు ఎవరు ఫినిష్‌ అవుతారో చూద్దామన్నారు. మరుసటి రోజే వైయస్‌ఆర్‌ ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయన్నారు. దీనికి టీడీపీ నాయకులు సమాధానం చెప్పగలరా అని రోజా ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చేస్తుంది చంద్రబాబేనని రోజా విమర్శించారు. ఓట్లు వేయకుంటే నేను వేసిన రోడ్లుపై నడవకూడదు.. నేను ఇచ్చే పెన్షన్లు తీసుకోవద్దు అని రౌడీలా మాట్లాడిన చంద్రబాబు ముఖ్యమంత్రా అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. మీ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తా, లేక మీ అత్తగారి ఆస్తి తీసి ఇస్తున్నారా అని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసింది నీవు కాదా అని సీఎంను నిలదీశారు. 

మంత్రులవి పిచ్చి ప్రేలాపణలు
అడ్డదిడ్డంగా మంత్రి పదవులు పొంది నంద్యాలలో మకాం వేసి తిరుగుతున్న వారిని ప్రజలు పట్టించుకోవడం లేదని రోజా అన్నారు.  సభకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీకి తడిసిపోయిందని, అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు ఎంత నీచమైన వ్యక్తో ఆయన వదిన, చంద్రబాబు చెప్పిన మాటలు వింటే అర్థం అవుతుందన్నారు. అదే విధంగా సోదిరెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఆదినారాయణరెడ్డి కేశవరెడ్డి బాధితులకు డబ్బులు ఇప్పించి నంద్యాలలో ఓట్లు అడగాలని సూచించారు. 

శోభా నాగిరెడ్డి విలువలున్న నాయకురాలు
దివంగత నేత శోభా నాగిరెడ్డి విలువలున్న నాయకురాలని, ఆవిడను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు గౌరవిస్తుందని రోజా అన్నారు. పీఆర్పీ నుంచి వచ్చినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసివచ్చి చివరి రక్తపు బొట్టు వరకు వైయస్‌ జగన్‌ సీఎం కావాలని పనిచేసిందన్నారు. ఆవిడ మరణాంతరం వైయస్‌ జగన్‌ గురించి ఆ కుటుంబ సభ్యులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. శోభ నాగిరెడ్డి మరణించిన సమయంలో వైయస్‌ జగన్‌ కుటుంబం మొత్తం రెండు రోజులు పాటు అక్కడే ఉండి అక్కగా గౌరవం ఇచ్చారన్నారు. అనంతరం భూమా నాగిరెడ్డికి పీఏసీ పదవి ఇచ్చి వైయస్‌ జగన్‌ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. భూమా మరణానికి కారణమైన వారి పక్షాన చేరి అఖిలప్రియ తల్లి ఆశయాలకు తూట్లు పొడుస్తుందని రోజా విమర్శించారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను బంగాళాఖాతంలో కలిపేందుకు నంద్యాల ప్రజలకు అవకాశం దొరికిందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పాలని కోరారు. 
Back to Top