మొదట కూల్చాల్చింది చంద్రబాబు భవంతిని


మంగళగిరి)
అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామంటూ రాజధాని సాధికారికి సంస్థ(క్రీడా) కమిషనర్
శ్రీకాంత్ చేసిన ప్రకటన మీద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి
స్పందించారు. ఆ విధంగా ఆలోచిస్తే మొదట కూల్చాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
భవంతినే అన్న సంగతి ఆయన గుర్తు చేశారు. అధికారులు తమ చిత్తశుద్ధిని
నిరూపించుకోవాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం
రాజధాని ప్రాంతానికే చెందినదని, అది అక్రమ కట్టడం అన్న సంగతి అందరికీ తెలుసు అని
ఆయన స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలు పేరుతో పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటమే
ప్రభుత్వ లక్ష్యమని ఆర్  కే అన్నారు.

 

Back to Top