చంపుతామంటూ ఆర్కేకు బెదిరింపు లేఖ

()మా నాయకుడిపైనే కోర్టులో కేసు వేస్తావా
()నిన్ను నీ నియోజకవర్గంలోనే చంపుతాం’
()అసభ్యపదజాలంతో ఆగంతుకుడి లేఖ
()పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్కే

గుంటూరు: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై కోర్టుకు వెళ్లిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ లేఖ రాశారు. మా నాయకుడిపేనే కోర్టులో కేసు వేస్తావా..నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళితే నిన్ను నియోజకవర్గంలోనే చంపుతానంటూ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు.  

ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని ఇటీవలే ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.  దీంతో, బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.  విచారణ ఎదుర్కోకుండానే తనపై కేసు కొట్టేయాలంటూ  చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేయగా, దానిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీనిపై ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతుండగా ‘‘ టీడీపీలో కలవరం మొదలైంది. 

ఆర్కే పోరాట నేపథ్యంలో పచ్చపార్టీ బెదిరింపులకు పాల్పడుతోంది. నిన్ను మంగళగిరిలోనే చంపేస్తాం. నిన్ను బతకనివ్వం. మీమంటే ఏంటో చూపిస్తాం ఖబడ్దార్ అంటూ’’ ఆర్కేను దుర్భషలాడుతూ లేఖలో హెచ్చరించారు.  ఈ మేరకు ఎమ్మెల్యే  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Back to Top