రిషితేశ్వ‌రి మ‌రణంపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిపించాలి..!

గుంటూరు : ఆర్కిటెక్చ‌ర్ విద్యార్థి రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు
కార‌కులైన వారికి రాజ‌కీయ అండ‌దండ‌లు ఉన్నాయ‌ని నిర్ధార‌ణ అయింది. ఈ
ఆత్మ‌హ‌త్య‌, పూర్వాప‌రాలు, ర్యాగింగ్ ప‌రిస్థితులు, కులం కోణం వంటి
అంశాల‌పై ప‌రిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ త‌ర‌పున ఒక నిజ నిర్ధార‌ణ క‌మిటీ
ఏర్పాటైన విష‌యం తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన సీనియ‌ర్
నాయ‌కుల‌తో ఈ క‌మిటీ ఏర్ప‌డింది. ముందుగా అనుమ‌తి తీసుకొన్న ఈ క‌మిటీ
క్యాంప‌స్ కు చేరుకోగానే, లోప‌ల‌కు ప్ర‌వేశించ‌కుండా పోలీసులు ఆపేశారు.
అనుమ‌తి తీసుకొన్నామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ లోప‌ల‌కు పోనీయ‌లేదు. దీంతో
ప్ర‌జాప్ర‌తినిధుల అక్క‌డే ధ‌ర్నాకు దిగారు. చివ‌ర‌కు దిగివ‌చ్చిన
అధికారులు ప్ర‌జా ప్ర‌తినిధుల్ని లోప‌ల‌కు అనుమ‌తించారు.

ఘ‌ట‌న
చోటు చేసుకొన్న ప‌రిస్థితుల్ని క‌మిటీ ప‌రిశీలించింది. అక్క‌డ వారితో
మాట్లాడింది. వివ‌రాలు అడిగి తెలుసుకొంది. అనంతరం ఈ ఘ‌ట‌న వివ‌రాల్ని
వెల్ల‌డించింది. క్యాంప‌స్ లో కులాల కుంప‌ట్లు కొన‌సాగుతున్నాయ‌ని ఆవేదన
వ్య‌క్తం చేసింది. ర్యాగింగ్‌, ఈవ్ టీజింగ్ కార‌ణంగానే రిషితేశ్వ‌రి
ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని క‌మిటీ అభిప్రాయ ప‌డింది. ఈ ఆత్మ‌హ‌త్య తాలూకు
నిందితుల‌కు రాజ‌కీయ శ‌క్తుల అండ‌దండ‌లు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఆ
శ‌క్తులే ఆయ‌న్ని కాపాడుతున్నాయ‌ని క‌మిటీ పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై
ప్ర‌శ్నించినందుకే డేవిడ్ రాజ్ అనే ఉద్యోగి ని ఉద్యోగం నుంచి
తొల‌గించార‌ని, ద‌ళితుడు అయినందుకే క‌క్ష క‌ట్టార‌ని వివరించారు.
ఇప్ప‌టికైన రిషితేశ్వ‌రి మ‌ర‌ణంపై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని
అభిప్రాయ ప‌డ్డారు.
Back to Top