రిషితేశ్వ‌రి కేసులో నిందితుల‌కు పెద్ద‌ల అండ‌లు.. వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు

గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాల‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకొన్న
రిషితేశ్వ‌రి మ‌ర‌ణానికి కార‌కులు అయిన వారికి ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల అండ
ఉంద‌ని వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయి రెడ్డి అన్నారు.
పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న గుంటూరు జిల్లాలో ఈ ఘ‌ట‌న పూర్వాప‌రాల్ని
ప‌రిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో త్వ‌రిత గ‌తిన
విచార‌ణ చేసి, నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డేట్లుగా చేయాల‌ని ఆయ‌న
డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ
క‌ర‌వైంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

మ‌రోవైపు, రిషికేశ్వ‌రి మ‌ర‌ణంపై
విచార‌ణ జ‌రిపించాలంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో
వివిధ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు  నిర్వ‌హించారు. అనంత‌పురం, తిరుప‌తి,
క‌ర్నూలు త‌దిత‌ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు క‌దం తొక్కారు.
ర్యాగింగ్ భూతాన్ని త‌రిమి కొట్టాల‌ని వారు డిమాండ్ చేశారు.
Back to Top