గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనంగ వీడ్కోలు

విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల రైతు దీక్ష నిర్వహించి హైదరాబాద్‌కు తిరుగు పయనమైన వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఆదివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. జగన్  దీక్ష ముగించుకుని రోడ్డు మార్గాన కృష్ణా జిల్లా గన్నవరం  చేరుకున్నారు. అక్కడి  నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, కోన రఘుపతి, మహ్మద్ ముస్తాఫా, పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగవీటి రాధాకృష్ణ, తలశిల రఘురామ్, మర్రిరాజశేఖర్, ఆళ్ల నాని, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, సామినేని ఉదయభాను గౌతమ్‌రెడ్డి, దుట్టా రామచంద్రరావు, ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు, అన్నా బత్తుని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్‌తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు  భూమా నాగిరెడ్డి, ఆర్.ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌కు వెళ్లారు.
Back to Top