"గడపగడపకు వైయస్ఆర్" కార్యక్రమంపై రివ్యూ మీటింగ్

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌తన కేంద్ర కార్యాల‌యంలో `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌` కార్య‌క్ర‌మంపై స‌మీక్షా స‌మావేశాలు జరుగుతున్నాయి. చంద్ర‌బాబు రెండేళ్ల పాలన వైఫ‌ల్యాల‌తో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గడప గడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం ఎలా జ‌రిగింది, ఇంకా ఏం చేయాలనే దానిపై ఇవాళ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల నేతలతో వైయ‌స్‌ జగన్ సమావేశమవుతారు. ఇదే అంశంపై నిన్న వైయస్ జ‌గ‌న్  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నాయకులతో చర్చిచిన సంగతి తెలిసిందే. ఇక ముందు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌నేదానిపై నాయ‌కుల‌కు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

Back to Top