ఆక్రమిత భూముల విముక్తికి కృషి: సునీల్‌కుమార్

నెల్లూరు: వాకాడు మండలంలో అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వం భూముల విముక్తికి రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. వాకాడులోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండలంలో 5 వేల ఎకరాలకుపైగా భూములను కొందరు ఆక్రమించుకున్నారని సమావేశంలో పలువురు సర్పంచులు ఆరోపించారు. ఈ విషయాన్ని పదేపదే అధికారుల దృష్టికి తీసుకువస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే సర్వే జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రూ.77 కోట్ల ప్రభుత్వం భూములు ఆక్రమణకు గురయ్యాయని పత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించి కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top