వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన రిటైర్డ్‌ జడ్జి

నంద్యాల: వైయస్‌ జగన్‌ లాంటి ధైర్యం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కులు పొందగలడని జిల్లా రిటైర్డ్‌ జడ్జి, రాష్ట్ర కురబ సంఘం అధ్యక్షుడు కృష్ణప్ప అన్నారు. నంద్యాలలో పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే కోన రఘుపతిల సమక్షంలో కృష్ణప్ప వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంటు, రుణమాఫీ చేసిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిది అన్నారు. అదే విధంగా పేదవారికి ఉచితంగా వైద్యం అందించిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని కొనియాడారు.

Back to Top