చంద్రబాబుకు అధికారంలో కొనసాగే అర్హత లేదు

కర్నూలు: పూటకో మాటతో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత కోల్పొయిందని రిటైర్డు ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయన్నారు. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తున్నారని రిటైర్డు ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని సూచించారు. అనుభవం ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్‌ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. 

 
Back to Top