వైయస్‌ఆర్‌ సీపీలోకి రిటైర్డ్‌ ఐపీఎస్‌

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీరెడ్డి చేరారు. ఆదివారం జక్కారంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్మీరెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ లక్ష్మీరెడ్డికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం శ్రమిస్తున్న వైయస్‌ జగన్‌ ఆత్మసై్థర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగిగా జీవితం గడుపుతున్న తనకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందన్నారు. తన సేవలను పార్టీ ఏ విధంగా వినియోగించుకుంటే ఆ విధంగా సహకరిస్తానన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. 
Back to Top