మహానేత ఆత్మశాంతి కోసం


                     రెంటచింతల:
 జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆత్మశాంతి కోసం సీతానగరం పుష్కరఘాట్‌లో  రెంటచింతల మండల నేతలు, కార్యకర్తలు పిండప్రదానం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను, ప్రజలు పడుతున్న బాధలను చూసి వైయస్‌ ఆత్మ ఘోషిస్తోందని వారు పేర్కొన్నారు.  కార్యక్రమంలో వైయస్సార్సీపీ రాష్ట్ర యువజన సభ్యులు మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, రెంటచింతల సర్పంచ్‌ గుర్రాల రాజు, ఉపసర్పంచ్‌ ఏలూరి సత్యం,  మండల ఉపాధ్యక్షుడు ఏరువ శౌరెడ్డి, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, గొట్టం పద్మాజానాసరరెడ్డి, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు బొంకూరు తిరుపతిరావు, పార్టీ నేతలు పమ్మి సీతారామిరెడ్డి, ఓర్సు కాశయ్య,  తిరుపతిరెడ్డి, కిషోర్‌ తదితరులున్నారు.
Back to Top