మంత్రి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం

ముమ్మిడివరం : దళితులను అగౌరపరిచే విధంగా ఆనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖా మంత్రి ఆదినారాయనరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. ముమ్మిడివరంలో గురువారం పార్టీ మండల ఎస్సీసెల్‌ అద్యక్షుడు బళ్ల వెర్రబ్బాయి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు మాట్లాడారు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, లేని ప«క్షంలో దళిత నాయకుల ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. సమావేశం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కాశి బాలమునికుమారి, కాట్రు అప్పారావు, కమిడి ప్రవీణ్‌కుమార్, జనిపెల్ల బాలశ్రీనివాస్, బుడిత సహదేవుడు, నక్కా సర్వేశ్వరరావు, కాశి రామకృష్ణ, భీమవరపు విజయ్, జనిపెల్ల రమేష్‌బాబు, యలమంచలి శ్రీనివాస్, కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top