నెల్లూరు నీటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

నెల్లూరు) నెల్లూరు జిల్లా కు సంబంధించిన తాగు, సాగు నీటి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని వైఎస్సార్సీపీ శాస‌న‌స‌భ్యులు కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ విన్న‌వించారు. అసెంబ్లీ లో ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో ఈవిష‌యాల్ని ప్ర‌స్తావించారు. క‌నిగిరి రిజ‌ర్వాయ‌ర్‌, నెల్లూరు రిజ‌ర్వాయ‌ర్ ల‌కు సంబంధించిన నీటి వ‌న‌రుల్ని అభి్వ్ర‌ద్ది చేయాల‌ని కోటంరెడ్డి కోరారు. ఆ ప్రాంతంలో బాలా సాహెబ్ ద‌ర్గా, ప‌ర‌మేశ్వ‌ర త‌ల్లి దేవాల‌యాలు ఉన్నాయ‌ని స‌భ కు తెలియ చేశారు. అక్క‌డ ట్యాంక్ బండ్ మాదిరిగా చేసి, ప‌ర్యాట‌క ప‌రంగా డెవ‌ల‌ప్ చేస్తామ‌ని గ‌తంలో పాల‌కులు చెప్పార‌ని విన్న‌వించారు. అటు, నెల్లూరు అర్బ‌న్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. పెన్నా బ్యారేజ్ ప‌నుల్ని చేపట్టాల‌ని కోరారు. దీంతో నెల్లూరు న‌గ‌రంలో తాగునీటి వ‌న‌రులు మెరుగు ప‌ర‌డంతో పాటు, కోవూరు ప్రాంతానికి సాగునీటి సౌక‌ర్యం క‌లుగుతుంద‌ని వివ‌రించారు. దీని మీద మంత్రి దేవినేని ఉమ సానుకూలంగా స్పందించారు. 
Back to Top