ఉద్యోగాలు ఇవ్వండి ప్లీజ్‌

హైద‌రాబాద్‌) చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు పూర్త‌వుతున్నాప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీ స‌భ్యులు అసెంబ్లీ దృష్టికి తీసుకొని వ‌చ్చారు. ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఎస్వీ మోహ‌న్ రెడ్డి, చాంద్ బాషా త‌దిత‌రులు ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తారు. ముఖ్యంగా ఇటీవ‌ల నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్ర‌భుత్వ ప‌థ‌క‌మే లేద‌ని చెప్ప‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టో లో ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పార‌ని, లేదంటే నిరుద్యోగ భృతి క‌ల్పిస్తామ‌ని చెప్పార‌ని, కానీ ఈ విష‌యం గాలికి వ‌దిలేశార‌ని వివ‌రించారు. దీనికి స‌మాధానం ఇచ్చిన కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎప్ప‌టిలాగే రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌టానికి ప‌రిమితం అయ్యారు. 
Back to Top