టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


గుంటూరు: అధికార‌ పార్టీ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రేప‌ల్లి మండలంలోని పేటేరుకు చెందిన టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరిని మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌రావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన వైయ‌స్ జగన్‌తోనే సాధ్యమన్నారు. . వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన శొంఠి సురేష్, సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న టీడీపీ అరాచపాలనను భరించలేక వైయ‌స్ఆర్‌సీపీ లో చేరుతున్నట్లు చెప్పారు.  వైయ‌స్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో శొంఠి బాలకృష్ణ, వాకా నాగబాబు, శొంఠి సురేష్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శంకర్, వీరంకి రవీంద్ర, చెన్ను పాండు, వీరంకి భాగ్యారావు, మరో 30 మంది ఉన్నారు.. 


Back to Top