రెండు గంటల కరెంటుకు కూడా ఆపసోపాలు!


కొనకండ్ల

6 నవంబర్ : కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు గంటలు కరెంట్ ఇవ్వడానికి ఆపసోపాలు పడుతోందని షర్మిల విమర్శించారు. వైయస్ నాడు తొమ్మిది గంటల పాటు కరెంటు ఇస్తామంటూ వాగ్దానం చేస్తే ఈ ప్రభుత్వం ఆ మాట నిలుపుకోలేక పోయిందన్నారు. 20 వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల మంగళవారం అనంతపురం జిల్లా కొనకండ్లలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డిగారు ఉండి ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్తు అందేదన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పి జగనన్నను గెలిపిస్తే రాజన్న రాజ్యం వస్తుందని షర్మిల అన్నారు. రాజశేఖర రెడ్డిగారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటికీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆమె విమర్శించారు. రాజశేఖర రెడ్డిగారిని మీ ముందు దోషిగా నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి మాటలు బూటకమన్నారు. "వడ్డీ లేని రుణాలు కాదు కదా, తమకు రెండ్రూపాయల వడ్డీ పడుతోందని దారిలో వస్తుంటే మాకు కొందరు చెప్పారు" అని షర్మిల అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ధరల స్థిరీకరణ నిధి కింద మూడువేల కోట్ల రూపాయలు కేటాయించి రైతులకు గిట్టుబాటు ధర లబించేలా చూస్తాడని ఆమె హామీ ఇచ్చారు. అలాగే అమ్మఒడి పథకం కింద ఉచిత విద్యాపథకం తెస్తాడనీ, రాజన్న ఇచ్చిన ప్రతి మాటా నిజం చేస్తాడనీ షర్మిల భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబుకు అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదన్నారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర పేరుతో కొత్త నాటకానికి బాబు తెరతీశారన్నారు. చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటుపొడిచి అధికారంలోకి వచ్చారని ఆమె గుర్తు చేశారు.
షర్మిల సమక్షంలో అభినవ బర్త్ డే ...
ఇదిలావుండగా మంగళవారం ఒక చిన్నారి తన పుట్టిన రోజు వేడుకను షర్మిల సమక్షంలో జరుపుకుంది. వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం ముసలేటి పల్లెకు చెందిన విజయభాస్కర రెడ్డి కూతురు అభినవ రోడ్డు పక్కనే కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకుంది. ఇలా షర్మిల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా హాపీగా ఉందని అభినవ సంబరంగా చెప్పింది. షర్మిల సమక్షంలోనే తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తానని పట్టుబట్టి ఈ చిన్నారి అక్కడకు వచ్చింది.

తాజా వీడియోలు

Back to Top