కోటిలింగాలలో ఇళ్లు తొలగించడం దారుణం: వైఎస్ జగన్

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కోటి లింగాల పుష్కర్ ఘాట్ను పరిశీలించారు.  కోటిలింగాలలో పుష్కరాలకు ముందు ఇళ్లు తొలగించడం దారుణమని వైఎస్ జగన్ విమర్శించారు. ఆదివారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగించడం వల్ల ప్రభుత్వ పెద్దలకు పాపం చుట్టుకుంటుందని వైఎస్ జగన్ అన్నారు. కోటిలింగాల బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు నామినేటెడ్ పద్ధతిలో పనులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.

ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగే అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంకల విహహానికి హాజరవుతారు. అలాగే ఇటీవల వివాహమైన కాకినాడ రూరల్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారుడు నరేష్, కోడలు స్రవంతిలను వైఎస్ జగన్ ఆశీర్వదించనున్నారు. ఈ రోజు సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
Back to Top