ప‌లాస‌లో రెడ్డిశాంతి ప‌ర్య‌ట‌న‌

శ్రీ‌కాకుళంః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి ప‌లాస మండ‌లంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని ద‌ర్శించుకున్నారు. సాయిబాబాకు ప్ర‌త్యేక పూజ‌లు చేసి తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. అనంత‌రం ఆల‌యంలో జ‌రుగుతున్న నిత్యాన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తుల‌కు ఆహార‌ప‌దార్థాల‌ను వ‌డ్డించారు. అక్క‌డ నుంచి బ‌య‌ల్దేరి ప‌లాస‌లో పార్టీ సీనియ‌ర్ నేత మ‌ద్దిలి హ‌రినారాయ‌ణ గృహ‌ప్ర‌వేశ మ‌హోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. రెడ్డి శాంతి వెంట వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు.

Back to Top