ఉద్యోగం ఎండ‌మావే-ఎమ్మెల్యే ఆర్కే

మంగ‌ళ‌గిరి) రాజ‌ధాని ప్రాంతంలో ఉద్యోగం అంటే ఎండ‌మావే అని మంగ‌ళ‌గిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామ క్రిష్ణారెడ్డి అభిప్రాయ‌పడ్డారు. సీ ఆర్ డీ ఏ రిక్రూట్ మెంట్ లు అన్నీ హేళ‌న‌గా త‌యారు అవుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌ల నిడ‌మ‌ర్రు లో ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. సీఆర్ డీ ఏ అధికారులు నిర్వ‌హించిన ప్ర‌తిభ ప‌రీక్ష‌లో గెలిచిన అభ్య‌ర్థుల‌కు కూడా అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తిభ క‌న‌ప‌రిచినా మంత్రికి న‌చ్చ‌లేద‌న్న కార‌ణంగా అన్యాయం చేశార‌ని ఆయ‌న వివ‌రించారు. రాజ‌ధానిలో ఉద్యోగాలు ఎండ‌మావిలా త‌యారు అవుతున్నాయ‌ని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. 
Back to Top