అందుకే నారాయణకు ర్యాంకులొస్తున్నాయా?

విజయవాడ: ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ల వల్లే నారాయణ కాలేజ్‌కు ర్యాంక్‌లు వస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అనుమానం వ్య‌క్తం చేశారు. మీడియా పాయింట్‌లో మంగ‌ళ‌వారం ఆమె పేప‌ర్ లీకేజీ అంశంపై మాట్లాడారు.  పేద విద్యార్థులు తిండి తిప్పలు మానేసి అహర్నిషలు కష్టపడి చదువుతుంటే లీక్‌లు చేసుకుంటే నారాయణ కళాశాల ర్యాంకులు కొట్టుస్తుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... పేపర్‌ లీక్‌కు తమకు సంబంధం లేదని మంత్రి నారాయణ మీడియా పాయింట్‌లో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిజంగా మంత్రులు, ముఖ్యమంత్రి తప్పుచేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని వారిని శిక్షించి మీ సశ్చిలతను నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని సూచించారు. దొంగలెవరూ దొంగతనం చేశామని ఒప్పుకోరుని ఎద్దేవా చేశారు. నెల్లూరులో పేపర్‌ ఎందుకు లీక్‌ అయ్యిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స‌భ‌లో ఏ రోజు కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నోరు మెద‌ప‌ని ఫిరాయింపు ఎమ్మెల్యే క‌డ‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ మాపై విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గు చేటు అన్నారు. చంద్ర‌బాబు స‌మాధానం చెప్ప‌లేక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో ఎదురుదాడికి దిగ‌డం దౌర్భ‌గ్య‌మ‌న్నారు.

తాజా వీడియోలు

Back to Top